22-12-2024వతేది భానుసప్తమి అంటే ఏమిటి? ఈరోజు పాటించవలసిన నియమాలు తెలుసుకోండి.
22-12-20244వ తేదీ ఆదివారం సప్తమి తిది రెండు కలిసి రావడం వలన దేనిని భానుసప్తమిగా విశేషమైనటువంటి రోజుగా శాస్త్రాలు చెబుతున్నాయి. మనమందరం మామూలుగానే ఆదివారము రోజున చక్కని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కానీ మనము తెలిసి తెలియక ఆదివారం రోజున అనేక పొరపాట్లు చేస్తున్నాము అనేక తప్పిదాలు చేస్తున్నాము దీనివల్ల చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కావున ఈ ఆదివారం రోజున భాను సప్తమి రోజున పాటించవలసినటువంటి నియమాలు ముందుగా తెలుసుకుందాం.
మొదటగా సూర్యోదయం లోపే నిద్రలేవాలి. ఈరోజు అభ్యంగన స్నానం చేయకూడదు తల స్నానం చేయవచ్చు. ఈరోజు శరీరానికి మరియు తలకు నువ్వుల నూనె రాసుకోకూడదు. అంతేకాకుండా ఈరోజు ఉల్లి, వెల్లుల్లి మధ్యము, మాంసాలు స్వీకరించకూడదు నియమనిష్ఠులతో ఉండాలి. ఇక చివరగా బ్రహ్మచర్యం పాటించాలి.
ఈ భానుసప్తమి అనేటువంటి రోజు సూర్యునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున మనం చేసేటువంటి స్నానము ధానము జపము హోమము అర్చన ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని లక్షరెట్ల ఫలితాన్ని మనకు తెచ్చి పెడతాయి. ఈరోజు ఆవుపాలతో చేసినటువంటి పరమాన్నాము లేదా గోధుమ నూకతో చేసినటువంటి ప్రసాదమునైన ఆ యొక్క సూర్యభగవానునికి నివేదన చేయడం చాలా మంచిది.
నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని అనుగ్రహం ఉంటే మనం సాధించలేని అంటూ ఏదీ ఉండదు. సూర్యభగవానుని అనుగ్రహంతో విద్య ఉద్యోగము వ్యాపారము సంతాన సమస్యలను వివాహ సమస్యలను నియమనిష్టలతో సూర్యభగవారని పూజించి మనం తొలగించుకోవచ్చు. సూర్యారాధన వలన చక్కని మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం భాస్కరధిచ్చేత్ అని శాస్త్ర వచనం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ మనము ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.
ఈ ఆదివారము రోజున స్నానాలు దానము జపము బ్రహ్మచర్యము వంటి నియమాలు పాటించనటువంటి వారికి దరిద్రం పడుతుందని అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని సాక్షాత్తు పరమశివుడే సూర్యాష్టకం లో చెప్పడం జరిగింది.
ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్థినే|
సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రత ||
స్త్రీతైలమధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే |
న వ్యాదిః శోకదారిద్యం సూర్యలోకం సగచ్చతి||
ఈ ఆదివారం రోజున మద్యము మాంసము వంటివి స్వీకరించడం వలన ఏడు జన్మల వరకు రోగిగా ఉండడము అంతేకాకుండా దరిద్రాన్ని అనుభవించడం జరుగుతుంది స్త్రీలతో సంఘము జరపడము బ్రహ్మచర్యాన్ని పాటించకపోవడం వలన దుఃఖాలు అనుభవించి సరాసరి సూర్యులోకానికే వెళతారని చెప్పడం జరిగింది.
ఈ నియమాలు కేవలం బాను సప్తమికి మాత్రమే కాదు ప్రతి ఆదివారం రోజున కూడా పాటించడం చాలా మంచిది కనుక అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు సూర్యగ్రహ ఆరాధన కోసం తప్పకుండా స్వామివారి అనుగ్రహం కోసం సూర్యాష్టకాన్ని చదవడం ఆదిత్య హృదయం చదవడం సూర్యుని యొక్క ద్వాదశ నామాలు పటించడము చాలా మంచిది ఎన్నో శుభ ఫలితాలు చేకూరి మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి.
శ్రీరామచంద్రుడు అంతటి వారు రావణున్ని యుద్దంలో జేయించడానికి సూర్యోదయం ప్రార్థించడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతిరోజూ ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అన్ని విధాలా కూడా జయం చేకూరుతుంది ఓం శ్రీ సూర్యనారాయణ నమః