shani bhagavan nivaran remedys

Daivanugraham
0

shani bhagavan nivaran remedys

 1. నిరంతరం శివ నామ స్మరణ, పారాయణం, శివ పంచాక్షరీ జపం చేయడం.


2. నిత్యమూ లేదా శనివారం నాడుఇంట్లో లేదా నవగ్రహ ఆలయం, శివాలయం లో నూవుల నూనెతో దీపారాధన



3. పేదలకు దానాలు చేయడం


4. శివాలయం లో శివుణ్ణి, నవగ్రహ ఆలయంలో శనైశ్చరున్ని శంఖ పుష్పాలతో పూజించడం.


5. కులదేవత లేదా శివాలయం లేదా నవగ్రహ ఆలయం లో అర్చక స్వాములు వెలిగించే దీపానికి మీ పేరు మీద కనీసం నెలకు ఒకసారైనా 2kg ల నూవుల నూనె ఇవ్వడం 


6. చలికాలం లో పేదవారికి నల్లని కంబళ్ళు అందించడం 


7. లెప్రసి అనగా కుష్టు వ్యాధికలిగిన వారి అనారోగ్యం తొలగుటకు వైద్య ఖర్చులు అందించడం  ఎందుకంటే కుష్టు వ్యాధి కలిగిగిన వారిలో శని నివాసం ఉంటారని నమ్మకం. కాబట్టి వారికి చేయడం వల్ల మీరు ప్రత్యక్షంగా శనిని పూజించినట్లు అవుతుంది. 


8. కుష్టు వ్యాధి కలిగిన వారికి శుభ్రమైన వస్త్రాలు, చెప్పులు, మందులు  దానం చేస్తే మంచిది 


9. ఇంటికి వచ్చి స్నేహితులకు , బంధువులకు స్నాక్స్ తో పాటు నూవులు, బెల్లం కలిపిన నూవు ఉండలు ఇవ్వడం మంచిది . 


10. శనివారం నాడు శివుణ్ణి, శనైశ్ఛరున్ని నూవుల నూనెతో అభిషేకించడం. 


11. శని, శివ క్షేత్రాలను దర్శించడం


12. శని ప్రదోషం నాడు శివుణ్ణి పూజించడం, 


13. మాస శివరాత్రి లేదా జన్మ నక్షత్రం రోజున శివుణ్ణి పూజించడం, మహాన్యాస రుద్రాభి షేకం, రుద్ర హోమం చేసుకోవడం  మంచిది. 


14. అమావాస్య రోజున శివుణ్ణి పూజించడం, పితృ దేవతల అనుగ్రహం కోరి స్వయం పాక దానాలు చేయడం మంచిది. 


15. రెగ్యూలర్ గా శరీరాన్ని నూవులనూనె తో శరీరాన్ని మర్దన ( మసాజ్ ) చేసి శరీరం ఆరిన తరువాత స్నానం చేయడం. 


16.  శని వెళుతు వెళుతూ అనారోగ్యం, వ్యాపారం లో నష్టాలు, గౌరవ భంగం, వాహన ప్రమాదాలు, కుటుంబ పెద్దలను కోల్పోవడం వంటి కీలక సంఘటనలు చోటు చేసుకుంటాయి. 


17. ఇవన్నీ చేయడం అనగా దానం , పూజలు చేయడం వలన కొంత డబ్బు ఖర్చు కావచ్చు కానీ అది తృప్తిని ఇస్తుంది. లేకపొతే అవన్నీ అనారోగ్యాల రూపం లో హాస్పిటల్స్ లో చెల్లించ వలసి వస్తుంది మీ ఇష్టం. 


18. అన్నింటికన్నా చేసే దానం , పూజ ఆనందంగా చేయాలి లేకపోతె అది ఇవ్వవలసిన ఫలితం ఇవ్వదు 


19. ఇక ఎంతో పుణ్యం చేసుకోవడం వలన లభించిన మానవ జీవితాన్ని   వృధా చేసుకోకుండా ధార్మిక, ఆధ్యాత్మిక అలవాట్లతో  ఇతరులకు జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top