రారా మంగళ మందు కోరా హరా | lord shiva mangala arathi song
శ్రీశివ హారతి
పరమ శివుడి గురించిన ఒక అధ్బుతమైన మంగళ హారతి మీకోసము
(రారా కౌగిలి జేర రారా అనుమాదిరి)
కనులార నిను జూడ మనసున్నది -
జీవనమేమొ! పరికింప - క్షణమైనది!
కనవేమయా! ఓ కరుణామయా! నీ -
కనికార - మున గాని మనలేనయా! ||రారా||
యెడబాసి - గడియైన - విడనాడకు!
నీ - యొడిలో నన్నిడుకొమ్ము - పడనీయకు!
తడవెందుకు? కన్నెడ సేయకు! నీ
యడుగంటి – పడియుందు - జడిపించకు ||రారా||
పరమాత్మ - విశ్వేశ! వరదా! శివా!
భాసుర పాండురంగా శ్రమా! శ్రీకరా!
పరమేశ్వరా! ఓ గిరిజా ప్రియా!
శంకర దీన మందార ! శశిశేఖర! ||రారా||