🙏శ్రీ గణపతి తాళం🙏
వికటోత్కట సుందరదంతిముఖం
భుజగేంద్రసుసర్పగదాభరణమ్ |
గజనీలగజేంద్ర గణాధిపతిం
ప్రణతోస్మి వినాయక హస్తిముఖమ్ ॥ 1॥
సుర సుర గణపతి సుందరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ ।
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే || 2 ||
గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ ॥ ౩॥
కరధృతపరశుం కంకణపాణిం కబలిత పద్మరుచిమ్ |
సురపతింద్యం సుందరసృత్తం సురచిత మణిమకుటమ్ || 4 ||
ప్రణమత దేవం ప్రకటిత తాళం షడ్దిరి తాళమిదమ్ |
తత్తత్ షడిరి తాళమిదం తత్తత్ షడిరి తాళమిదమ్ ॥ 5॥
లంబోదర వర కుంజా సురకృత కుంకుమవర్ణధరమ్ |
శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలమ్ ॥ 6 ||
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నయనత్రయవర నాగ విభూషిత నానాగణపతిదం తత్తత్
నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదమ్ || 7 ||
ధవళిత జలధరధవళిత చంద్రం
ఫణిమణికిరణ విభూషిత ఖడ్గమ్ |
తనుతనువిషహర శూలకపాలం
హర హర శివ శివ గణపతిమభయమ్ ॥ 8॥
కటతట విగలితమదజల జలధిత- గణపతివాద్యమిదం
కటతట విగలితమదజల జలధిత- గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదమ్ || 9 ||
తత్తది నం తరికు తరిజణకు కుకు తద్ది
కుకు తకిట డిండింగు డిగుణ కుకు తద్ది
తత్త ఝం ఝం తరిత
త ఝ ఝం తరిత
తకత ఝం ఝం తరిత
త ఝ ఝం తరిత
తరిణత దణజణుత జణుదిమిత
కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం తామ్ ॥ 10 ॥
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
శశికలిత శశికలిత మౌలినం శూలినమ్ |
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
విమల శుభ కమలజలపాదుకం పాణినమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రమథగణగుణ కథిత శోభనం శోభితం|
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
పృథులభుజసరసిజ విషాణకం పోషణమ్ |
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
పనసఫలకదలిఫలమోదనం మోదకమ్ |
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రణతగురు శివతనయ గణపతి తాళనమ్ |
గణపతి తాళనం గణపతి తాళనమ్ ॥ 11 ॥