విశ్వకర్మ పూజ, విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 17సెప్టెంబర్2024
సర్వులకు విశ్వకర్మ పరమేశ్వర యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు
సర్వము నుత్పన్నమొనర్చువాడు, పరమాత్మ, తండ్రివంటివాడు, పరమేశ్వరుడు,ఈశ్వరుడు, మోక్ష ప్రదాత, బ్రహ్మాండ నాయకుడు, సృష్టికర్త, రక్షకుడు, పరబ్రహ్మ,సమస్త సృష్టిని రచించినవాడు, జగత్కర్త, ప్రజాపతి,విరాట్ స్వరూపుడు, జగద్గురువు , సర్వాత్మకుల ప్రకాశకుడు, స్వయంప్రకాశకుడు, సూర్యాది పదార్థములను ప్రకాశింపజేయువాడు, సర్వత్రా అభివ్యాప్తమైయున్న జగదీశ్వరుడు.
ప్రాణములనిధి,హిరణ్యగర్భ,కాల స్వరూపుడు, స్వయంభువు, భక్తవత్సలుడు,పూర్ణజ్ఞాని, సర్వ వ్యాపకుడు, సుఖము, జ్ఞానము మున్నగువాని ప్రదాత,దుఃఖములు, దారిద్య్రములు మున్నగువాని వినాశకుడు.
వివిధ యజ్ఞముల నర్చుటయందు కుశలుడు, దోషములను దగ్ధమొనర్చువాడు, సద్గుణప్రాప్తిని గలిగించువాడు, మరణధర్మరహితుడు, సజ్జనుల రక్షకుడు, సత్య, గుణ, కర్మ స్వభావములు గలవాడు, అతిశయ మేధావి, వేదకావ్యముల కవి, పరమకీర్తివంతుడు, సర్వవ్యాపకుడు, జ్యోతిష్మంతుడు మరియు ప్రకాశములకు ప్రకాశకుడునైయున్నాడు.
ద్యావాపృథివియొక్క సంచాలకుడు, అందరకు హితమును సమకూర్చువాడు, నిరాకారుడు, ఉత్కృష్టమగు సత్యనియమములుగలవాడు , మహాకవి, విశ్వమునకు సామ్రాట్టు మరియు అందరను విపత్తులనుండి విముక్తులనొనర్చువాడు, జగత్ సామ్రాజ్య సంచాలకుడు, దేవాధిదేవుడు, పరమపిత,పరమైశ్వర్యవంతుడు.
దుఃఖ దారిద్య్రములను తొలగించు వాడు, సుఖసంపదల ప్రదాత, ధర్మాత్ముల ప్రశంసనీయుడు, దుష్కర్మిష్ఠుల విధ్వంసకుడు, సమస్త గుణగణముల మహానిధి, సద్గుణముల ఆధానమొనర్చువాడు, పరమదాత, పరమతేజస్వి, పరమవిద్వాంసుడు,పరమజాగరూకుడు.
బ్రహ్మాండమంతటికిని సమ్రాట్టు, మహాశక్తిశాలి, సర్వశక్తిమంతుడు, తేజస్వి, పాలనకర్త, పూరణకర్త, మహనీయుడు, శూరుడు, సత్యజ్ఞానవంతుడు, ఐశ్వర్యశాలి,సర్వాత్ముడు, సమస్తమును రచించువాడు, సమస్త ఐశ్వర్య ప్రదాత, , మహాతత్వరూపుడు, విద్యుత్తు,ప్రకృతి,సర్వ జగద్రక్ష, జగద్రష్ట, విశ్వబ్రహ్మ, మహా రాజాధిరాజా , సమస్త జగదుత్పాదకుడు, సకల ఐశ్వర్య యుక్తుడు, మహాత్ముడు, న్యాయాధిశూడు , నిత్యశుద్ధబుద్ధ ముక్త స్వభావుడు , సర్వంతర్యామి ,చేతన స్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వాత్ముడు, ఉత్తమ ఉన్నత ఐశ్వర్య యుక్త ,సర్వ ప్రాణి ప్రదాత, వేద ప్రకాశకుడు,వేదజ్ఞుడు ,వేద రక్షకుడు.
నిత్య పవిత్రుడు ,స్థిరములందు స్థిరుడును, సర్వత్ర వ్యాపించి సర్వలోక లోకాంతరములను రచించిన దాత, న్యాయకారి, సనాతనుడు, సమస్త పదార్థములకు భిన్నుడు, సూక్ష్మతి సూక్ష్మణుడు, ఉన్నతో ఉన్నతుడు ,ఉత్తముడు, అసమానుడు, సర్వవ్యాపకుడు, సకల పదార్థములను పరిశుద్ధపరచువాడు, నిర్మాత, సుఖప్రదుడు, శుద్ధుడు.
అందరి హృదయాలయందు నివసించేవాడు, పరమ కారణ స్వరూపుడు, సత్- చిత్ ఆనంద స్వరూపుడు, అధిష్టాత, వేద ప్రదాత ,అనంత సామర్థ్యం కలవాడు,ధాత ,విధాత , సర్వత్రాభివ్యాప్తుడు, ప్రకాశ స్వరూపుడు, అద్వితీయ పరమాత్మ ,స్థూల కార్యరూపడు ,జగదారుడు, అనంత జ్ఞాన జగదీశ్వరుడు, దారకుడు ,పాలకుడు, లయకర్త, ప్రళయకర్త, సర్వాధికారి, పాప రహితుడు ,సహచరుడు, లోకేశుడు, పరిపూర్ణుడు, సర్వశక్తిమంతుడు, చేతన స్వరూపుడు, సర్వలోకారణుడు, సర్వలోక ధారణుడు, , స్వయం ప్రకాశకుడు, దేవదేవుడు, సర్వోత్తముడు, అనంత స్వరూపుడు, అంతర్యామి, సకల జగత్తును ధారణ మొనర్చువాడు, సకల సుఖాలను ఇచ్చువాడు, ముక్తిదాముడు, ఆకాశమువలె వ్యాపకుడు , సర్వమునకు స్వామి, సర్వదృష్ట ,ఆజన్మడు, నిత్యముక్తుడు, నిర్మలడు, సర్వసాక్షి, నియంత, అనాది స్వరూపుడు, దివ్య స్వరూపుడు , జ్యోతి స్వరూపుడు, అవినాశి, , నిత్యుడు, పవిత్రుడు, అమరుడు, అభయుడు.
ఇంకా ఎన్నో ................
తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయుస్తదు చంద్రమా |
తదేవ శుక్రం తద్ బ్రహ్మ తా ఆప: స ప్రజాపతి: || (32-1)
సర్వవ్యాపకుడైన పరమాత్మయే స్వయం ప్రకాశముగల ప్రజాపతి విశ్వకర్మ. అన్నిదిశలకు తన ప్రకాశమును వ్యాపింపజేయు అగ్ని, తేజస్సుతో జగత్తుకు ప్రేరణ గలిగించు ఆదిత్యుడు, అంతటా ప్రాణశక్తిగా వ్యాపించు వాయువు, ఆనంద దాయకుడగు చంద్రుడు, పరిశుద్ధ తేజముగల శుక్రుడు. ఉత్కృష్టమగు జ్ఞానమును కలిగించు బ్రహ్మ(వేదమంత్రము), రస స్వరూపమై వ్యాపించు జలము - అన్నియు ఆయన నామ రూపములు. ప్రాణులందరికి అంతరాత్మయై సృష్టిని పరిపాలించు వాడు గావున ఆయనయే ప్రజాపతి.
గత కొన్ని సంవంత్సరాలనుండి రెండు తెలుగు రాష్ట్రాలలో భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము ఎంతో బాగా నిర్వహించుకొంటున్నాము.పరమాత్మ విశ్వకర్మకు పుట్టిన రోజు లేదు.అవతారపురుషులైతే ఫలాన అప్పుడు అవతరించారు, ఫలానా రోజున అవతారం చాలించారని చెప్పవచ్చు.
సృష్టికి ముందే ఆ పరమాత్మనుండి ఆవిర్భవించిన వారికి పుట్టిన రోజులు నిర్వహించటము మనం కల్పించుకున్నది.
కానీ ఇంకా కొంత మంది విశ్వకర్మ జయంతి అని ప్రచారం చేస్తున్నారు. వీరిలో కొంత మందికి విషయం పరిజ్ఞనమ్ లేక మాత్రమే , వారు సత్యాన్ని తెలుసుకొంటారు .
కానీ ...మరి కొంత మంది మాకు తెలిసిందే వేదం ,మీరేంటి మాకు చెప్పేది, ఇంకా కొంత మంది వారికున్న అతితెలివితో ఈరోజు కార్మిక దినోత్సవము జరపాలని మిడి మిడి జ్ఞానముతో ఏదో ఏదో మాట్లాడుతూ గొప్పలకు పోతున్నారు.
వారందరికీ నా విన్నపము ఏమనగ , మనకి తెలియకపోయిన ఎన్నో విషయాలు మనలో ఉన్న పెద్ద ,పెద్ద వైశ్వకర్మణా ఆచార్యలు వద్ద వెళ్లి తెలుసుకోవటంలో తప్పులేదు.
ఏదైనా ఇంతపెద్ద పండుగ జరిగేటప్పుడు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకొని మరొకరికి అవగాహన కలిగించి , మనం మర్చిపోయిన మన వైదిక సాంప్రదాయలను తిరిగి పునరుధ్ధరింప చెయ్యగలరు.