2025 జూలై 29 మంగళవారం నాగ పంచమి

Daivanugraham
0
2025 జూలై 29 మంగళవారం నాగ పంచమి చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే మంగళవారము నాగపంచమి రెండు కలిసి రావడం అనేది చాలా విశేషం
 ఈ రోజున తప్పకుండా సర్ప దోషాలు ఉన్నటువంటి వారు సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు ఈ రోజును ఉపయోగించుకోవాలి. 
ఎలా అంటే ఈరోజు తప్పకుండా వీలైనటువంటి వారు పైర నేను చెప్పినటువంటి వారందరూ కూడా ఆ నాగదేవతల అనుగ్రహం కోసం సుబ్రమణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రాతః కాలాన్ని స్నానం చేసి సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం వీలైతే క్షీరాభిషేక పూజా కార్యక్రమాన్ని జరిపించుకోవడం అలా కాకపోయినా నాగదేవతలు ఎక్కడైతే ప్రతిష్టించబడి ఉంటారో అక్కడికి వెళ్లి అక్కడ వారిని దర్శించుకోవడం మీ చేత్తో స్వయంగా క్షీరాభిషేకం చేయడం చాలా మంచిది.
ఇలా కుదరని వాళ్ళు కనీసం నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని మీకు వీలైనటువంటి సార్లు చదవడం చాలా మంచిది.

 ఇది నేను చెప్పినది కాదు నవనాగ స్తోత్రము అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను శ్రద్ధగా వినండి మీరు కూడా ఆచరించండి తద్వారా మీరు ఎల్లప్పుడూ కూడా విజయాలను పొందగలుగుతారు సర్పాల యొక్క భయం మీకు తొలగిపోతుంది అంతేకాదు మీకున్నటువంటి సంతాన సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి

నవనాగ స్తోత్రం

అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ||

ఫలశృతి


ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్ |
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః ||

సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః |
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్ ||

సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ |
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ||

ఓం నాగరాజాయ నమః ప్రార్థయామి నమస్కరోమి ||

ఇతి శ్రీ నవ నాగ స్తోత్రం |

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top